US Ban Effect on Crude | రష్యాపై అమెరికా ఆంక్షలు.. మరింత పైపైకి ముడి చమురు ధర ?!
US Ban Effect on Crude | తాజా అమెరికా ఆంక్షలతో రష్యా క్రూడాయిల్, గ్యాస్‌తోపాటు ఇతర నిత్యావసరాల ధరలు మరింత పైపైకి దూసుకెళ్లనున్నాయి.
US Ban Effect on Crude | ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బ తీసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం మరిన్ని ఆంక్షలు విధించారు. రష్యా ముడి చమురు, గ్యాస్ కంపెనీలపై నిషేధం ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పైపైకి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. గత నెలాఖరులో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచి.. అమెరికా, దానిమిత్ర దేశాలు నిషేధం విధించకముందే ముడి చమురు ధరలు సుమారు 30 శాతం పెరిగాయి. తాజాగా రష్యా ముడి చమురు, గ్యాస్ కంపెనీలపై బైడెన్ నిషేధం విధించడంతో బుధవారం నుంచి ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికాకు రష్యా నుంచి 5 లక్షల బీపీడీ క్రూడ్
అమెరికాలో గ్యాలెన్ ముడి చమురు ధర సగటున 4.07 డాలర్లు పెరిగింది. నెలారంభంతో పోలిస్తే 0.62 డాలర్లు, ఏడాది క్రితంతో పోలిస్తే 47 శాతం ఎక్కువైందని అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ తెలిపింది. రష్యా నుంచి ఐదు లక్షల బీపీడీ క్రూడ్ దాని అనుబంధ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటున్నది. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచానికి రష్యా ముడి చమురు వాటా ఇలా
ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరాలో రష్యా వాటా 10 శాతం. రష్యా గ్యాస్, చమురు కంపెనీలపై అమెరికా విధించిన నిషేధాన్ని అమలు చేసేందుకు యూరప్ దేశాలు ముందుకువస్తాయా? అన్న సందేహాలు ఉన్నాయి. రష్యాపై నిషేధాజ్ఞలు ప్రకటించిన జో బైడెన్.. తమతో యూరోపియన్ యూనియన్ మిత్ర దేశాలు సహకరించడం లేదని గుర్తు చేశారు.
రష్యాపై ఈయూ గ్యాస్ మార్కెట్
కానీ యూరోపియన్ యూనియన్ ఎకానమీ పూర్తిగా రష్యా ఇంధన సరఫరాపైనే ఉంది. ముడి చమురు, న్యాచురల్ గ్యాస్ ప్రత్యేకించి రష్యా నుంచి సహజ వాయువు 40 శాతం యూరప్ దేశాలకు సరఫరా అవుతుంది. ఒకవేళ ఈయూ సభ్య దేశాలు కూడా నిషేధం అమలు చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధర కూడా పెరగనున్నది.
ఘాటుగా రష్యా రియాక్షన్..
తమ ఉత్పత్తులపై నిషేధం విధించే అంశంపై రష్యా కూడా ఘాటుగానే స్పందించింది. ఒకవేళ, అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశ ముడి చమురు, గ్యాస్‌పై నిషేధం విధిస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 300 డాలర్ల మార్క్‌ను దాటుతుందని హెచ్చరించింది రష్యా. మంగళవారం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 126.08 డాలర్లుగా ఉంది.
నషాళానికి పెట్రోల్.. డీజిల్ ధరలు?
దీనివల్ల భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నషాళానికి అంటనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ ధరలతోపాటు ప్రజల ప్రయోజనాలను బట్టి వాటి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ చెప్పారు. అదే జరిగితే వివిధ వస్తువులు, సరుకుల రవాణా ఖర్చులు మరింత పెరుగుతాయి. ఆయా వస్తువుల ప్యాకేజింగ్‌లో ఉపయోగించే ప్లాస్టిక్ కూడా ముడి చమురు అనుబంధ ఉత్పత్తుల నుంచే వస్తుంది. అంటే ప్రతి వస్తువు ప్యాకేజింగ్ ఖర్చు కూడా పెరుగుతుందని పరిశ్రమ, వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

