Rupay Credit Card – UPI | యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు పేమెంట్స్.. అర్హులెవరు.. రోజువారీగా ఎంత చెల్లించవచ్చంటే..
Rupay Credit Card - UPI | యూపీఐ ద్వారా రూపే-క్రెడిట్ కార్డుల లావాదేవీలు జరుపుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. రూపే క్రెడిట్ కార్డు అనుమతించిన 16 బ్యాంకుల ఖాతాదారులు లావాదేవీలు జరుపుకోవచ్చు.
Rupay Credit Card – UPI | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. వీసా, మాస్టర్ కార్డుతోపాటు రూపే వంటి ఫైనాన్స్ సేవల సంస్థలు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఒకవేళ మీకు రూపే క్రెడిట్ కార్డు ఉందా..? ఉంటే మీరు ఫోన్‌పే, గూగుల్‌పే, భారత్‌పే మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)కు లింక్ చేసుకుని చెల్లింపులు చేయొచ్చు. యూపీఐ ద్వారా రూపే క్రెడిట్ కార్డు ద్వారా లావాదేవీలు నిర్వహించొచ్చు.
భీమ్, ఫోన్‌పే, జీపే, పేజాప్, గోకివి, స్లైస్, పేటీఎం, మొబిక్విక్, భీమ్ పీఎన్బీ, కెనరా ఐయిల్ (Canara Ail), గ్రో, క్రెడ్, ఐసీఐసీఐ మొబైల్, జూపిటర్, శాంసంగ్ వాలెట్, నెవీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఫ్రీ చార్జ్, అమెజాన్ పే, ఫినో పే, నియో గ్లోబల్, ఎస్పే నెక్ట్స్, జియో ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (వ్యోమ్) వంటి యూపీఐ యాప్స్‌లో రూపే క్రెడిట్ కార్డు ఫీచర్ ఉంటుంది. కనుక ఖాతాదారులు తమ రూపే క్రెడిట్ కార్డును తమకు నచ్చిన యాప్ ద్వారా పేమెంట్స్ చేసేయొచ్చు.
16 బ్యాంకులకు యూపీఐపై రూపే క్రెడిట్ కార్డు లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బీవోబీ ఫైనాన్సియల్ లిమిటెడ్, ఎస్బీఐ కార్డ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ ఉన్నాయి.
రూపే క్రెడిట్ కార్డుపై యూపీఐ ద్వారా ఒక రోజుకు రూ.లక్ష, మరికొన్ని స్పెషల్ ఎంసీసీ కోడ్స్ మీద రూ.2 లక్షల వరకూ చెల్లింపులు జరుపొచ్చు. అయితే క్రెడిట్ కార్డు వాడకం దారులకు గల లిమిట్‌ను బట్టి రోజువారీ ట్రాన్స్ఫర్ పరిమితులు ఉంటాయి. వీసా, మాస్టర్ కార్డు క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులు జరుపడానికి వీల్లేదు. ప్రస్తుతానికి రూపే క్రెడిట్ కార్డులను మాత్రమే యూపీఐకి అనుసంధానించేందుకు ఆర్బీఐ అనుమతించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

