న్యూఢిల్లీ, నవంబర్ 30: కీలక రంగాల్లో నిస్తేజం ఆవరించింది. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో అక్టోబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 20 నెలల కనిష్ఠ స్థాయి 0.1 శాతానికి పడిపోయింది. ఫిబ్రవరి 2021 తర్వాత ఇంత టి కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో 8.7 శాతంగా నమోదైన కీలక రంగాలు..ఈ ఏడాది సెప్టెంబర్లో 7.8 శాతంగా నమోదయ్యాయి. ఎనిమిది కీలక రంగాల్లో బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెం ట్, విద్యుత్ రంగాల్లో వృద్ధి మైనస్ 3.3 శాతానికి పడిపోయింది. కానీ, ఎరువుల ఉత్పత్తి 5.4 శాతం పెరిగింది. అలాగే ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలానికి కీలక రంగాలు 8.2 శాత ం వృద్ధిని కనబరిచాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన 15.6 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది.