కరోనా ఎఫెక్ట్ : ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు, వారానికి నాలుగు రోజుల పని!

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో మానసిక, శారీరక ఒత్తిళ్లకు లోనవుతున్న ఉద్యోగులకు ఊరట కలిగించేందుకు కార్పొరేట్ కంపెనీలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు వేతనంతో కూడిన సెలవలు, విశ్రాంతి దినాలను ఆఫర్ చేస్తున్నాయి. డెలాయిట్, హిందుస్ధాన్ యూనిలీవర్, పీడబ్ల్యూసీ, గోద్రెజ్ వంటి పలు కంపెనీలు తమ ఉద్యోగులు మహమ్మారి విలయంతో నైరాశ్యానికి లోనవకుండా వారికి ప్రశాంతత కల్పించేలా అదనంగా వీక్లీ, నెలవారీ ఆఫ్ లు ప్రకటించాయి.
డెలాయిట్ తమ సిబ్బందికి ఇప్పటికే ఉన్న సెలవులకు అదనంగా మరిన్ని రోజులు విధులకు దూరంగా ఉండే వెసులుబాటు కల్పిస్తూ హాలిడే పూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ తమ ఉద్యోగులందరి కోసం వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రకటించింది. పీడబ్ల్యూసీ సైతం తమ ఉద్యోగులకు హాలిడే పూల్ ను ఏర్పాటు చేసి మే నెలలో సిబ్బందికి మూడు రోజులు వేతనంతో కూడిన సెలవలు ఆఫర్ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corporates
- Covid-19
- paid leave
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

