LPG cylinder | చమురు కంపెనీలు శుభవార్త చెప్పింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.41 తగ్గింది. తగ్గిన ధరలు మంగళవారం నుంచే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,762కి చేరింది. ముంబయిలో రూ.1,714.50, కోల్కతాలో రూ.1,872, చెన్నైలో రూ.1,924.50కి ధర తగ్గింది. ప్రపచంవ్యాప్తంగా ముడి చమురు ధరతో పాటు పలు కారణాలతో సాధారణంగా ప్రతినెలలోనూ చమురు కంపెనీలు ధరలను సర్దుబాటు చేస్తుంటాయి.
మార్చి 1న రూ.6 ధర పెరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1 రూ.7 తగ్గించిన తర్వాత తాజాగా మరోసారి ధర తగ్గించింది. గత డిసెంబర్లో కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.62 పెరిగింది. తాజా ధర తగ్గింపు రెస్టారెంట్లు, హోటళ్లు, బల్క్ ఎల్పీజీపై ఆధారపడే వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. చమురు కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించినా.. 14.2 డొమెస్టిక్ సిలిండర్ల ధరలను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి.