Evergrande | పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న చైనా రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్‌గ్రాండే.. రుణాలను చెల్లించడానికి తన ప్రాపర్టీ మేనేజ్మెంట్ గ్రూప్‌లోని 51 శాతం వాటా విక్రయానికి ముందుకు వచ్చింది. చైనా సర్కార్ మద్దతు ఉన్న హప్సన్ డెవలప్మెంట్ ఈ వాటాను కొనుగోలు చేయనున్నదని వార్తలొచ్చాయి. ఇందుకోసం ఎవర్‌గ్రాండేకు హప్సన్ డెవలప్మెంట్ 500 కోట్ల డాలర్లు చెల్లించనున్నదని తెలుస్తోంది. దీనిపై ఎవర్ గ్రాండే కానీ, హప్సన్గానీ స్పందించలేదు.
ఇదిలా ఉంటే హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ నిలిచిపోయింది. దాని అనుబంధ ఎవర్ గ్రాండే ప్రాపర్టీ గ్రూప్ షేర్ల ట్రేడింగ్ నిలిపేశారు. తామే ట్రేడింగ్ నిలిపేయాలని కోరామని ఎవర్ గ్రాండే వెల్లడించింది. తామూ ట్రేడింగ్ నిలిపేయాలని హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీని కోరామని హప్సన్ డెవలప్మెంట్ ప్రకటించింది.