Changpeng Zhao | మెక్‌డొనాల్డ్ మాజీ ఉద్యోగి.. ఆయన పేరు చాంగ్పెన్జావో సరికొత్త రికార్డు సృష్టించారు. ఆసియా కుబేరుడూ రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఆయన తర్వాత స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీని దాటేశారు.. ముకేశ్, అదానీల కంటే సంపన్నుడిగా నిలిచారు చాంగ్‌పెంగ్ జావో. అంతేకాదు ప్రపంచ కుబేరులు ఎలన్‌మస్క్, జెఫ్ బెజోస్, బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, ల్యారీ ఎల్లిసన్ తదితరుల సరసన చేరారు. ప్రపంచంలోనే 11వ బిలియనీర్‌గా అవతరించారు.
చాంగ్ సంపద పెరగడానికి ప్రస్తుతం అంతర్జాతీయంగా మంచి ఊపులో ఉన్న క్రిప్టో కరెన్సీ బూమ్ కారణమైంది. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బినాన్స్ సీఈవోగా ఉన్నారాయన. ఆయన నికర సంపద 96 బిలియన్ డాలర్లు అని బ్లూంబర్గ్ అంచనా వేసింది. ఈ నెల 9 (ఆదివారం) నాటికి వేసిన అంచనా. ఇప్పటి వరకు చాంగ్‌పెంగ్ జావో వ్యక్తిగత సంపదపై తొలి అంచనా కావడం విశేషం.
ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 92.9 బిలియన్ డాలర్లు అని బ్లూం బర్గ్ పేర్కొన్నది. ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్ వ్యక్తిగత సంపత 107 బిలియన్ డాలర్లైతే, గౌతం ఆదానీ 78.6 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కలిగి ఉన్నారు. నాలుగున్నరేండ్ల క్రితం 2017 జూలైలో బినాన్స్ సేవలు ప్రారంభించింది.
ముకేశ్ అంబానీ.. ఎలన్ మస్క్.. జెఫ్ బెజోస్ తదితర బిలియనీర్లంతా దశాబ్దాల క్రితం ఏర్పాటైన సంప్రదాయ బిజినెస్‌ల ద్వారా సంపద కూడబెట్టుకోగలిగారు.. కానీ చాంగ్ పెంగ్ జావో కేవలం నాలుగున్నరేండ్లలో వారి సరసన నిలవడం విశేషం.
కానీ, బిట్ కాయిన్, బినాన్స్ క్రిప్టో టోకెన్.. బినాన్స్ కాయిన్ (బీఎన్బీ) పర్సనల్ హోల్డింగ్స్‌తో కలిపి ఈ మొత్తాన్ని లెక్కించారు. కనుక దీన్ని చాంగ్పెన్ జావో వ్యక్తిగత సంపదగా పరిగణించలేమని బ్లూంబర్గ్ తెలిపింది. గతేడాది బీఎన్బీ సుమారు 1300 శాతం పెరిగింది. 2021 ప్రారంభంలో బినాన్స్ కాయిన్ విలువ 41 డాలర్ల వద్ద మొదలైంది.
ఇప్పుడు బిట్ కాయిన్, ఎథీరియంలను దాటేసింది. గతేడాది బిట్ కాయిన్ కంటే బీఎన్బీ 63 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఎథీరియం కంటే 420 శాతం ఎక్కువ వృద్ధి చెందింది. గతేడాది మేలో 675కు చేరుకున్న బీఎన్బీ అదే నెలాఖరులో 261కి పడిపోయింది. గత ఆగస్టులో జావో నికర సంపద 1.9 బిలియన్ల డాలర్లుగా బ్లూంబర్గ్ లెక్కించింది.