న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్..రుణ గ్రహితలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్(ఎంసీఎల్ఆర్) రేటును 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణ రేటు 7.25 శాతానికి దిగొచ్చింది. అత్యధిక మంది వ్యక్తిగత, వాహన రుణాలు ఏడాది కాలపరిమితితోనే తీసుకుంటున్నారు. అలాగే ఒక్కరోజు, నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు కోత విధించడంతో రేటు 6.55 శాతానికి దిగొచ్చింది. ఈ నెల 7 నుంచి కొత్త వడ్డీరేట్లు అమలులోకి రానున్నట్లు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు ఈ నెల 6 నుంచి అమలులోకి వచ్చేలా ఎంసీఎల్ఆర్ని 0.05 శాతం తగ్గించింది డీసీబీ బ్యాంక్.