బెంగళూరు, ఏప్రిల్ 3: కెనరా బ్యాంక్.. సాలరీ ఖాతాదారుల కోసం ఆకర్షణీయమైన ఫీచర్లతో ఓ ‘ప్రీమియం పేరోల్ ప్యాకేజీ’ అకౌంట్‌ను పరిచయం చేసింది. వేతనజీవుల అన్ని బ్యాంకింగ్ అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందించినట్టు సోమవారం ఓ ప్రకటనలో బ్యాంక్ తెలిపింది. ఇందులో ఉచిత టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్‌స్టా ఓవర్ డ్రాఫ్ట్, ఉచిత వ్యక్తిగత-విమాన ప్రమాద బీమా కవరేజీలతోపాటు పలు యూనిక్ ఫీచర్లతో ప్రీమియం కార్డులను అందిస్తున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కెనరా బ్యాంక్ శాఖల్లో ప్రీమియం పేరోల్ అకౌంట్ లభిస్తుందన్నారు.