హైదరాబాద్, జూలై 16: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన కెనరా బ్యాంక్ మరో నూతన సేవలను ఆరంభించింది. ‘లైవ్ ఆన్ అకౌంట్ అగ్రిగేటర్’ సేవలను ఎఫ్ఐయూ(ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్), ఎఫ్ఐపీ(ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్) ప్రారంభించింది. ఇలాంటి సేవలు ఆరంభించిన మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కెనరా బ్యాంక్ కూడా ఉండటం విశేషం. ఈ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్ సేవల కింద సులభంగా, భద్రంగా డిజిటల్ డాటా యాక్సెస్ సేవలు పొందవచ్చును. ముఖ్యంగా ఖాతాదారుడు తమ అకౌంట్లో ఉన్న డబ్బు వివరాలు పొందవచ్చును. ఈ నూతన సేవలతో ఖాతాదారుడు బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు.