ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్..డిపాజిట్ దారులను ఆకట్టుకోవడానికి సరికొత్త టర్మ్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. 333 రోజుల కాలపరిమితితో కూడిన ఈ డిపాజిట్ స్కీంలో రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చేసుకునే అవకాశం ఖాతాదారులకు బ్యాంక్ కల్పించింది.
సెప్టెంబర్ చివరి వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక స్కీం కింద డిపాజిట్ చేసిన వారికి 5.10 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. అలాగే సీనియర్ సిటిజన్లకు మాత్రం 5.60 శాతం చొప్పున వడ్డీని చెల్లించనున్నది.