న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వు బ్యాంక్ రెపోరేటును పావు శాతం పెంచినప్పటికీ కెనరా బ్యాంక్ మాత్రం రుణాలపై వడ్డీని 15 బేసిస్ పాయింట్లు తగ్గించడం విశేషం.
ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ను 9.40 శాతం నుంచి 9.25 శాతానికి దించింది.