BYJU’S | ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ బైజూస్ విస్తరణ వేగవంతం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కోడింగ్ ప్లాట్‌ఫామ్
ట్యింకర్`ను టేకోవర్ చేసుకుంది. పదికోట్ల మందికి పైగా విద్యార్థులు ట్యింకర్ ప్లాట్‌ఫామ్‌పై శిక్షణ పొందుతున్నారు. ట్యింకర్ సంస్థను స్వాధీనం చేసుకుంటున్న సంగతిని బైజూస్ గురువారం ధ్రువీకరించింది. దీంతో ట్యింకర్కు మున్ముందు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, ఉపాధ్యాయులు, స్కూళ్లకు, కోడింగ్ క్యాంపస్‌లకు క్రియేటివ్ కోడింగ్ ప్లాట్‌ఫామ్ సృష్టించగల సామర్థ్యం లభిస్తుంది.
ఈ సందర్భంగా బైజూస్ వ్యవస్థాపక సీఈవో బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ప్రోగ్రామింగ్ పట్ల ప్రేమ రగల్చడమే తమ లక్ష్యం అని చెప్పారు. శరవేగంగా పిల్లలకు ప్రోగ్రామింగ్ అందుబాటులోకి తేవడంలో ట్యింకర్ కోడింగ్ ప్లాట్‌ఫామ్ ముందు ఉంటుందని గట్టిగా నమ్ముతున్నట్లు తెలిపారు. 2013లో ఏర్పాటైనప్పటి నుంచి ట్యింకర్ 700 కోట్లకు పైగా కోడింగ్ లైన్స్ సృష్టించడంలో చిన్నారులకు సాయ పడింది.