IMDbIndia | ప్రముఖ అంతర్జాతీయ సినీ డేటాబేస్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) తాజాగా ఈ వారానికి సంబంధించిన ‘మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్’ జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 20 కోట్ల మందికి పైగా సందర్శించే నెటిజన్ల సెర్చ్ ట్రెండ్స్, పేజీ వ్యూస్ ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. సాధారణంగా ఈ జాబితాలో నటీనటులే అగ్రస్థానంలో నిలుస్తుంటారు. కానీ ఈసారి సరికొత్త రికార్డు సృష్టిస్తూ దర్శకుడు ఆదిత్య ధర్ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడమే ఇందుకు కారణం. ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటులు కూడా ఈ జాబితాలో భారీగా ట్రెండ్ అవుతున్నారు.
పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ వీరే.!
1. ఆదిత్య ధర్ (దర్శకుడు): సాధారణంగా నటీనటులు ఉండే అగ్రస్థానాన్ని ఈసారి ఓ దర్శకుడు కైవసం చేసుకోవడం విశేషం. ఇటీవల విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) చిత్రానికి అద్భుతమైన మేకింగ్, విజన్‌తో ప్రాణం పోసిన ఆదిత్య ధర్ నంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు.
2. సారా అర్జున్: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సారా.. ఇప్పుడు కథానాయికగా తన సత్తా చాటుతోంది. ‘ధురంధర్’ సిరీస్‌లో ఆమె పోషించిన ‘యాలీనా’ పాత్రకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె పరిణతితో కూడిన నటనకు భారీ రెస్పాన్స్ రావడంతో ఐఎమ్‌డీబీ చార్ట్స్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
3. రణ్వీర్ సింగ్: ‘ధురంధర్ 2’ చిత్రంలో ‘హంజా/జస్కీరత్’ పాత్రలో పవర్‌ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్.. ఈ వారపు పాపులారిటీ లిస్టులో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
4. చిత్రాంగద సింగ్: సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ చిత్రం ‘మాతృభూమి’ నుండి ఇటీవల విడుదలైన ‘చాంద్ దేఖ్ లేనా’ అనే పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ క్రేజ్‌తో గతంలో 120వ స్థానంలో ఉన్న చిత్రాంగద.. ఏకంగా 4వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం.
15. మల్లికా ప్రసాద్: ఈమె నటించిన యాక్షన్ డ్రామా ‘మర్దానీ 3’ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో మంచి ఆదరణ దక్కుతోంది. దీంతో నెటిజన్లు ఈమె గురించి తెగ సెర్చ్ చేయడంతో 384వ స్థానం నుంచి ఏకంగా 15వ స్థానానికి ఎగబాకింది.
18. సువిందర్ విక్కీ: ‘ధురంధర్ 2’ లో అద్భుత నటనతో పాటు, త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతున్న ‘స్టార్మ్’ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కారణంగా ఈయన 18వ స్థానంలో ట్రెండ్ అవుతున్నాడు.
24. విజయ్ సేతుపతి: వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి.. ఇటీవల జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ‘కాట్టాన్’ చిత్రంలో ‘ముత్తు’ అనే పవర్ఫుల్ పాత్రలో అదరగొట్టారు. ఈ సినిమా అందించిన పాపులారిటీతో ఆయన 24వ స్థానంలో నిలిచాడు.
25. డానిష్ పాండోర్: ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంలో అద్భుతమైన నటనను కనబరిచిన డానిష్.. నెటిజన్ల దృష్టిని ఆకర్షించి 25వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
36. దివ్యా దత్తా: ఈమె నటించిన ‘చిరైయా’ చిత్రం జియో హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో దివ్యా దత్తా ర్యాంకు మునుపటి 68 నుండి 36వ స్థానానికి మెరుగైంది.
38. మానవ్ గోహిల్: ‘ధురంధర్ 2’ చిత్రంలో కీలక పాత్రలో మెప్పించిన మానవ్ గోహిల్.. మునుపటి 70వ ర్యాంకు నుండి జంప్ చేసి ఇప్పుడు 38వ స్థానానికి చేరుకున్నారు.
41. జానకి బోడివాలా: నెట్‌ఫ్లిక్స్‌లో ‘మర్దానీ 3’ స్ట్రీమింగ్ అవుతుండటంతో జానకి బోడివాలా పాపులారిటీ కూడా పెరిగింది. దీంతో గతంలో 367వ స్థానంలో ఉన్న జానకి.. ఇప్పుడు 41వ స్థానానికి చేరింది.
47. కెన్ కరుణాస్: కరుణాస్ దర్శకత్వం వహించిన ‘యూత్’ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలో ఇతడి ర్యాంకు 101 నుంచి 47వ స్థానానికి చేరుకుంది.
Presenting you IMDb’s Popular Indian Celebrities of the week 🌟
See the complete list on the IMDb app, available on iOS and Android 🍿 pic.twitter.com/yYISC5Ce8W
— IMDb India (@IMDb_in) April 1, 2026
✨ #KenKarunas ranks #47 from #101 with the release of his directorial Youth pic.twitter.com/UcsNHwqlvX
— IMDb India (@IMDb_in) April 1, 2026