Union Budget 2025 | క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు.. ఆదాయం పన్ను చట్టంపై సమీక్ష..!
Union Budget 2025 | ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గ ప్రజానీకానికి ఉపశమనం కలిగించేలా ఉపాధి కల్పన, ప్రభుత్వ వ్యయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల విధానంలోనూ కొన్ని కీలక మార్పులు ప్రకటించారు.
Union Budget 2025 | పేదలు, మహిళలు, రైతుల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరా (2024-25)నికి బడ్జెట్ సమర్పించారు. మధ్యతరగతి వర్గ ప్రజానీకానికి ఉపశమనం కలిగించేలా ఉపాధి కల్పన, ప్రభుత్వ వ్యయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల విధానంలోనూ కొన్ని కీలక మార్పులు ప్రకటించారు. స్వల్పకాలిక పెట్టుబడి లాభాలు, దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను తగ్గించినా ఎస్టీటీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పాత ఆదాయం పన్ను విధానం యధాతథంగా కొనసాగిస్తూ కొత్త ఆదాయం పన్ను విధానంలో కొన్ని మార్పులు ప్రకటించారు. బడ్జెట్ ముఖ్యాంశాలిలా..
మధ్య తరగతి వర్గ ప్రజలకు సాయం చేసేందుకు ఆదాయం పన్ను చట్టం -1961పై సమగ్ర సమీక్ష.
కొత్త ఆదాయం పన్ను విధానంలో నూతన శ్లాబ్లు
రూ.3 లక్షల ఆదాయం వరకూ పన్ను మినహాయింపు
రూ.3 లక్షల నుంచి ఏడు లక్షల వరకూ ఐదు శాతం పన్ను
రూ.7-10 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం పన్ను
రూ.10-12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం పన్ను
రూ.12-15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం పన్ను
రూ.15 లక్షలు, ఆపై ఆదాయం కల వారిపై 30 శాతం పన్ను
నూతన ఆదాయం పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ రూ.30 వేల నుంచి రూ.75 వేలకు పెంపు.
పెన్షనర్ల ఫ్యామిలీ పెన్షన్ పై డిడక్షన్ రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు.
పెట్టుబడి లాభాల పన్ను విధానం సరళీకరణ
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద పన్ను 20 శాతానికి తగ్గింపు.
కొన్ని ఆస్తులపై ఎల్టీసీజీ 12.5 శాతం.
అన్ లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్.
సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ 0.0625 శాతం నుంచి 0.1 శాతానికి పెంపు. కొన్ని తరహాల ఫ్యూచర్ సెక్యూరిటీల విక్రయంపై ఎస్టీటీ 0.01 నుంచి 0.02 శాతానికి పెంపు.
ఈ-కామర్స్ మీద టీడీఎస్ ఒకశాతం నుంచి 0.1 శతానికి తగ్గింపు.
అన్ని రకాల పెట్టుబడిదారులపై ఏంజిల్ ట్యాక్స్ రద్దు
కస్టమ్స్ డ్యూటీలో మార్పులు చేర్పులు
బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ ఆరు శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గింపు.
బ్లిస్టర్ కాపర్, ఫెర్రో నికెల్ పై కస్టమ్స్ డట్యూ తగ్గింపు. స్పెషిఫైడ్ టెలికం పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ 10 నుంచి 15 శాతానికి పెంపు.
బ్రూడ్ స్టాక్స్, ష్రింప్స్, ఫిష్ ఫాడ్ మీద కస్టమ్స్ డ్యూటీ ఐదు శాతానికి తగ్గింపు
అమోనియం నైట్రేట్ మీద కస్టమ్స్ డ్యూటీ 10 శాతానికి, నాన్ బయో డిగ్రేగడబుల్ ప్లాస్టిక్ మీద 25 శాతానికి పెంపు.
మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీబీఏ, చార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం తగ్గింపు
25 కీలక ఖనిజాలపై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా తొలగింపు.
ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ పెంపు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

