BSNL | కేంద్ర ప్రభుత్వ టెలికం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన యూజర్లను పెంచుకునే పనిలో పడింది. ఇందుకోసం వినూత్నంగా #switchtoBSNL అనే క్యాంపెయిన్ చేపట్టింది. బీఎస్ఎన్ఎల్ డేటాకు మారే యూజర్లకు నెల రోజుల పాటు 5జీబీ హైస్పీడ్ డేటా ఉచితంగా అందిస్తుంది. అయితే, ఈ డేటా ప్రస్తుత నెట్వర్క్ నుంచి బీఎస్ఎన్ఎల్కు పోర్టయిన వారికే ఈ ఆఫర్ వర్తిస్తున్నది. దేశంలోని అన్ని సర్కిళ్లలో ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
ఇతర నెట్‌వర్క్‌ల నుంచి తమ నెట్‌వర్క్‌లోకి వచ్చే యూజర్లకు బీఎస్ఎన్ఎల్ షరతులు పెట్టింది. ఆ ఖాతాదారులు తమ ఫేస్బుక్, ట్విట్టర్ ప్లాట్‌ఫామ్స్‌లో #switchtoBSNL ప్రచారాన్ని షేర్ చేయాలి. బీఎస్ఎన్ఎల్ అఫిషియల్ ఫేస్బుక్ పేజీ @bsnlcorporate, ట్విట్టర్ హ్యాండిల్ (@BSNLcorporate ఫాలో చేయాలి. తాము ఎందుకు నెట్వర్క్ మారుతున్నామో కూడాసోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తెలపాలి. అంతే కాదు.. పోర్టబుల్ కానున్న నంబర్ నుంచి 9457086024 అనే ఫోన్ నంబర్‌కు స్క్రీన్షాట్లు పంపాలి. వీటిని పరిశీలించాకే ఆ ఖాతాదారులకు 30 రోజుల పాటు హైస్పీడ్ 5జీబీతో ఇంటర్నెట్ డేటా అందిస్తుంది.