BSNL Offer | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ.. భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన ఖాతాదారులకు అద్భుతమైన నూతన సంవత్సర బహుమతి అందించింది. ప్రైవేట్ టెలికం సంస్థలు టారిఫ్ చార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. కానీ బీఎస్ఎన్ఎల్ అందుకు భిన్నంగా.. యూజర్లకు ఆకర్షించడానికి ఆకర్షణీయ ఆఫర్లు లభించింది. తక్కువ టారిఫ్‌కే ఎక్కువ డేటాతోపాటు కొన్ని దీర్ఘకాలిక ప్లాన్లు తెచ్చింది. వీటిల్లో 84 రోజుల వ్యాలిడిటీ గల రూ.599 ప్లాన్ అందరినీ ఆకర్షిస్తున్నది. ఈ ప్లాన్ సబ్స్క్రైబర్లకు ప్రతి రోజూ 5జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు చేయొచ్చు.
ఇంకా రూ.2,399లకే 425 రోజుల ప్లాన్, ఉచితంగా బీఎస్ఎన్ఎల్ ట్యూన్లు వస్తాయి. వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. 600 జీబీ డేటా 365 రోజుల ప్లాన్‌ను రూ.1999లకే అందిస్తోంది. రెండు నెలల వరకు వావ్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రిప్షన్, లభిస్తుంది. రూ.1999లకే 180 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ ఆఫర్ అందిస్తోంది.