న్యూఢిల్లీ, డిసెంబర్ 16: బ్రిటానియా ఇండస్ట్రీస్ తమ పాపులర్ బిస్కట్ బ్రాండ్ ‘గుడ్ డే’లో మరో మూడు రకాలను పరిచయం చేసింది. ప్రీమియం సెగ్మెంట్లో స్మైల్స్, డింపుల్డ్ స్మైల్, డబుల్ డింపుల్డ్ స్మైల్ వేరియంట్లలో సరికొత్తగా బిస్కట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని సంస్థ ఎండీ వరుణ్ బెర్రీ చెప్పారు. ఇందులో గుడ్ డే హార్మనీ రకం వచ్చే 15 రోజుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందన్న బెర్రీ.. మిగతా రెండు రకాలను వచ్చే మూడు నెలల్లో తీసుకొస్తామని తెలిపారు. ఈ బిస్కట్లు మరింత పెద్దవిగా నాలుగు రకాల నట్స్‌తో ఉంటాయన్నారు. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో గుడ్ డే బిస్కట్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగినట్లు వెల్లడించారు. ఇదిలావుంటే గుడ్ డే బ్రాండ్‌ను ప్రస్తుతానికైతే బిస్కట్లకే పరిమితం చేస్తున్నామని, ఇతర ఫుడ్స్ విభాగాల్లోకి విస్తరించే యోచనేదీ లేదన్నారు. 1987లో గుడ్ డే బిస్కట్లు పరిచయం అవగా, ఇప్పుడు బ్రిటానియా ఇండస్ట్రీస్ ఆదాయంలో దాదాపు నాలుగో వంతు వీటిదే కావడం గమనార్హం.