కోల్కతా, ఏప్రిల్ 14 : దేశీయ మార్కెట్లోకి త్వరలో బాష్ ఎయిర్-కండీషనర్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా ఎండీ సంజయ్ సుధాకరన్ సంకేతాలిచ్చారు. కాగా, ఇప్పటికే యూరప్, మరికొన్ని దేశాల మార్కెట్లలో బాష్ ఏసీలు అమ్ముడవుతున్న విషయం తెలిసిందే.
నిజానికి హిటాచీ ఏసీలతో బాష్ దేశీయ మార్కెట్లో విక్రయాలు సాగిస్తున్నది. ఈ నేపథ్యంలో బాష్ పేరిట భారతీయ మార్కెట్లోకి ఏసీలను తెచ్చినా.. హిటాచీ జాయింట్ వెంచర్లో బాష్ కొనసాగనున్నది. ఇందుకు ఇరు సంస్థల మధ్యనున్న దీర్ఘకాలిక ఒప్పందమే కారణం.