న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో రాత్రికి రాత్రి విశేష ఆదరణ పొందిన జూమ్ ప్రత్యర్ధి, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ బ్లూజీన్స్ (BlueJeans) మూతపడింది. యాప్‌ను మూసివేస్తున్నట్టు బ్లూజీన్స్ సర్వీస్ ఉద్యోగులకు ఈమెయిల్స్ వచ్చాయని 9టూ5గూగుల్ రిపోర్ట్ స్పష్టం చేసింది. బ్లూజీన్స్ షట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా తొలుత వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఫ్రీ వెర్షన్ ఆగస్ట్ 31 నుంచి అందుబాటులో ఉండదు.
బ్లూజీన్స్ పెయిడ్ వెర్షన్ సేవలను ఉపయోగించుకునే వాణిజ్య కస్టమర్లకు కొద్దికాలం సేవలు కొనసాగిన అనంతరం యాప్ క్లోజ్ అవనుంది. యాప్‌ను పూర్తిగా మూసివేసిన తర్వాత పెయిడ్ సభ్యులకు వారు చెల్లించిన మొత్తం రిఫండ్ చేస్తారా అనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. బ్లూజీన్స్లో మీరు ఎలాంటి రికార్డింగ్స్ సేవ్ చేసకున్నా వాటిని ఆగస్ట్ 31లోగా డౌన్లోడ్ చేసుకోవాలని ఆపై బ్లూజీన్స్ ప్రైవసీ పాలసీకి అనుగుణంగా మీ కంటెంట్ డిలీట్ అవుతుందని కంపెనీ పంపిన అధికారిక ఈ-మెయిల్లో పేర్కొంది.
2009లో లాంఛ్ అయిన బ్లూజీన్స్‌ను అమెరికన్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ వెరిజన్ 2020లో స్వాధీనం చేసుకుంది. గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ కంటే ముందు జూమ్‌కు బ్లూజీన్స్ అతిపెద్ద పోటీదారుగా భావించారు. జూమ్ చైనా కంపెనీ కావడంతో పలువురు కస్టమర్లు బ్లూజీన్స్ వైపు మొగ్గుచూపారు.
Read More :
BCCI Income Tax: బీసీసీఐ ఎంత ఇన్‌కం ట్యాక్స్ కట్టిందో తెలుసా?