Bit Coin | 20 వేల డాలర్ల దిగువకు బిట్ కాయిన్.. క్రిప్టోలన్నీ విలవిల
Bit Coin | క్రిప్టో కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. క్రిప్టో మేజర్ బిట్‌కాయిన్ 2020 డిసెంబర్ తర్వాత 20 వేల డాలర్ల దిగువన ట్రేడయింది.
Bit Coin | అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల ప్రభావం క్రిప్టో కరెన్సీలపైనా పడింది. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ సహా అన్ని క్రిప్టో కరెన్సీలు విలవిల్లాడుతున్నాయి. బిట్ కాయిన్ శనివారం ట్రేడింగ్‌లో 20 వేల దిగువకు పడిపోయింది. 2020 డిసెంబర్ తర్వాత అత్యంత కనిష్ఠం ఇదే. పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచేయడంతో రిస్క్ అవకాశం ఉన్న అసెట్ల నుంచి ఇన్వెస్టర్లు నిధులు ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా శనివారం ఉదయం 9.06 గంటల సమయంలో బిట్ కాయిన్ 7.1 శాతం నష్టపోయి 18,993 డాలర్లు పలికింది. 2020 డిసెంబర్లో 18,732 డాలర్ల స్థాయికి పడిపోయిన బిట్ కాయిన్ మళ్లీ ఆ కనిష్ఠ స్థాయికి పతనం కావడం ఇదే తొలిసారి.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బిట్ కాయిన్ 59 శాతం నష్టపోయింది. బిట్ కాయిన్ తర్వాత స్థానంలో ఉన్న ఎథేర్ కూడా 73 శాతం పతనమైంది. గతేడాది ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకున్న క్రిప్టో కరెన్సీలు ఈ ఏడాది భారీగా నష్టపోయాయి. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ 12 రోజులుగా నేల చూపులే చూస్తున్నది. ఈ వారంలో 34 శాతం పతనమైంది. గత 24 గంటల్లో 9 శాతం పతనమై 19 వేల మార్క్ వద్ద ట్రేడవుతున్నది.
గత ఏడాది నవంబర్‌లో మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్న క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్.. ఇప్పుడు 900 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే మరిన్ని వడ్డీరేట్ల వడ్డింపులు ఉంటాయని అమెరికా ఫెడ్ రిజర్వ్ హెచ్చరికలు జారీ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

