BitCoin | గతవారం అమ్మకాల ఒత్తిడికి గురైన క్రిప్టో కరెన్సీల పతనం సోమవారం కూడా కొనసాగింది. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 49వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఒక్కరోజే మూడు శాతం పతనమైంది. గతనెల 10న 69 వేల డాలర్లను దాటి ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది బిట్ కాయిన్. తాజాగా జరిగిన ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 20 శాతం వరకు నష్టపోయింది. సోమవారం బిట్ కాయిన్ 48,130 పాయింట్ల వద్ద తచ్చాడింది.
బిట్ కాయిన్ తర్వాత రెండో పెద్ద క్రిప్టో కరెన్సీ ఎథిరియం కూడా నష్టాల బాటలోనే పయనించింది. గత నెల 10 గరిష్ఠంగా 4868 డాలర్లు తాకింది. ఇది 2018 మే తర్వాత అత్యంత గరిష్ఠం. కానీ ఎథిరియం సోమవారం నాలుగు శాతం పతనమై 4,062 డాలర్ల వద్ద ట్రేడయింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా నష్టాల బాటలోనే పయనించాయి.
డోజ్కాయిన్ ఆరుశాతానికి పైగా నష్టపోయి 0.16 డాలర్లు, శిభా 8 శాతానికి పైగా నష్టపోయి 0.000034 డాలర్ల వద్ద నిలిచింది. ఇంకా లైట్ కాయిన్, ఎక్స్ఆర్పీ, పొల్కాడాట్, యూనిస్వాప్, కార్డానో, సొలానా, పాలిగాన్ తదితర క్రిప్టోలు కూడా డౌన్ ట్రెండయ్యాయి. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ ఐదు శాతం నష్టపోయి 2.33 లక్షల కోట్లడాలర్లకు పతనమైంది.