హైదరాబాద్, జనవరి 6: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’.. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ఆకర్షణీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్‌తోపాటు రూ.5,999 విలువైన స్మార్ట్‌వాచ్, రూ.1,799 విలువైన ఎయిర్‌బడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
అలాగే ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఒప్పో రెనో 13 మొబైల్ కొనుగోళ్లపై రూ.7,990 విలువ కలిగిన స్విస్ మిలిటరీ స్పీకర్‌తోపాటు ఏడాదిపాటు మొబైల్ ప్రొటెక్షన్, రూ.5 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తున్నట్లు చెప్పారు.