న్యూఢిల్లీ, మార్చి 30: ప్రభుత్వరంగ ఇంజినీరింగ్ ఉత్పత్తుల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) ఆర్డర్లు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. తాజాగా ఇరాక్ నుంచి కంప్రెసర్ ప్యాకేజ్ ఆర్డర్ లభించింది. ఇరాక్ చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బైజి రిఫైనరీదే ఈ ఆర్డర్. దీంతో భెల్ మరో మైలురాయికి చేరుకున్నదని, అంతర్జాతీయంగా ఆర్డర్లు దక్కించుకోవడంలో దూసుకుపోతున్నదని, ముఖ్యంగా ఇరాక్ నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కంప్రెసర్ ప్యాకేజ్ ఆర్డర్ లభించడం విశేషమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్, భోపాల్ తయారీ కేంద్రాల నుంచి ఈ కంప్రెసర్ ప్యాకేజ్లు సరఫరా అవుతాయి.