హైదరాబాద్, ఆగస్టు 24: మెట్రోపాలిటన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎంఎల్ఐసీ) లేదా మెట్లైఫ్.. బీమా, యాన్యుటీస్, ఉద్యోగ లబ్ధిదాయక కార్యక్రమాల్లో ప్రపంచ దిగ్గజంగా వెలుగొందుతున్నది. 155 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ 1868లో మొదలైంది. ప్రస్తుతం 60కిపైగా దేశాల్లో 9 కోట్లకుపైగా కస్టమర్లకు ఈ సంస్థ సేవలు అందుతున్నాయి. రెవిన్యూపరంగా అమెరికాలోని టాప్-50 కార్పొరేట్ సంస్థల్లో కూడా మెట్లైఫ్ ఉన్నది. మొదట్నుంచీ అభివృద్ధిని ఒడిసి పట్టుకుంటూ విస్తరిస్తూపోతున్న ఈ సంస్థ.. ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను తీసుకు రాబోతున్నది. ఇది రాష్ట్ర బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాన్ని మరింత బలోపేతం చేయగలదన్న అభిప్రాయాలు అంతటా వినిపిస్తున్నాయి. ఈ రంగంలో యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలూ దక్కుతాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఇక్కడ పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సెంటర్.. అటు సంస్థకు, ఇటు బీఎఫ్ఎస్ఐ రంగానికీ దోహదపడనున్నది.
సంస్థ : మెట్లైఫ్
ప్రారంభం : మార్చి 24, 1868
పరిశ్రమ : ఆర్థిక సేవలు
ప్రధాన కార్యాలయం : న్యూయార్క్, అమెరికా
చైర్మన్ : గ్లెన్ హబ్బర్డ్
ప్రొడక్ట్స్ : బీమా, యాన్యుటీస్, ఉద్యోగ లబ్ధిదాయక కార్యక్రమాలు
రెవిన్యూ : 71.08 బి.డాలర్లు (2021)
ఆపరేటింగ్ ఆదాయం : 8.13 బిలియన్ డాలర్లు
నికర లాభం : 6.55 బిలియన్ డాలర్లు
మొత్తం ఆస్తులు : 759.71 బి.డాలర్లు
మొత్తం ఈక్విటీ: 67.75 బిలియన్ డాలర్లు
ఉద్యోగులు :43 వేలపైనే
అనుబంధ సంస్థ: పీఎన్బీ మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ