Bell Layoffs | వర్చువల్ భేటీలో 400 మందిని తొలగించిన బెల్ : 10 నిమిషాల్లో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు
Bell Layoffs : కెనడా టెలికాం దిగ్గజం బెల్ కేవలం పది నిమిషాల వర్చువల్ మీటింగ్‌లో ఏకంగా 400 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. మిగులు ఉద్యోగులని చెబుతూ వారిని విధుల నుంచి తొలగించింది.
Bell Layoffs : కెనడా టెలికాం దిగ్గజం బెల్ కేవలం పది నిమిషాల వర్చువల్ మీటింగ్‌లో ఏకంగా 400 మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసింది. మిగులు ఉద్యోగులని చెబుతూ వారిని విధుల నుంచి తొలగించింది. బెల్ నిర్ణయం సిగ్గుచేటని యూనియన్ యూనిఫర్ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది ఉద్యోగులకు పది నిమిషాల భేటీలతో పింక్ స్లిప్స్ ఇవ్వడం పట్ల కంపెనీ పారదర్శకత పాటించలేదని ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి.
ఎన్నో ఏండ్ల నుంచి అంకితభావంతో పనిచేస్తున్న మా సభ్యులకు పింక్ స్లిప్స్ బహుమతిగా ఇచ్చారని యూనిఫోర్ క్యుబెక్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే లేఆఫ్స్‌కు ఐదు వారాల ముందుగానే యూనియన్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ పారదర్శకత పాటించామని బెల్ పేర్కొంది.
తొలగించిన ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్ వర్తింపచేసేందుకు హెచ్ఆర్తో సమావేశాలు ఏర్పాటు చేశామని కంపెనీ వెల్లడించింది. బెల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 4800 మంది ఉద్యోగులను తొలగించిన అనంతరం లేటెస్ట్ లేఆఫ్స్ తెరపైకి వచ్చాయి. కంపెనీని సరళీకరించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని లేఆఫ్స్‌ను కంపెనీ సీఈవో మిర్కో బిబిక్ సమర్ధించారు.
Read More :
Heat wave | మూడు రోజులు మాడు పగులుడే.. మరింత పెరుగనున్న ఉష్ణోగ్రతలు!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

