May Bank Holidays | ఇప్పుడంతా మొబైల్ ఫోన్ యాప్ బేస్డ్, ఆన్ లైన్, డిజిటల్ పేమెంట్సే. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నారు. వారు అవసరమైనప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తుంది. కానీ, బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. పండుగలు, పర్వదినాలు, ఇతర కారణాల రీత్యా సెలవులు ఉంటాయి. దీని ప్రకారం మే నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 రోజులు బ్యాంకులు పని చేయవు. వాటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. మే డే.. కార్మిక దినోత్సవం సందర్భంగా ఒకటో తేదీన దేశమంతటా కార్మికులు మేడే జరుపుకుంటారు. కనుక `మేడే`తో ఈ నెల ప్రారంభం అవుతున్నది.
తేదీ — సెలవు కారణం ——— సెలవు ఉండే ప్రాంతాలు
01 —– మే డే ——————– బెలాపూర్, బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచి, కోల్ కతా, ముంబై, నాగ్ పూర్, పనాజీ, పాట్నా, తిరువనంతపురం
02 — మున్సిపల్ ఎన్నికలు — సిమ్లా
05 — బుద్ధ పౌర్ణమి ————- అగర్తల, ఐజ్వాల్, బెలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, రాయ్ పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్
07 — ఆదివారం —————- దేశమంతటా
09 — రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి —- కోల్ కతా
13 — రెండో శనివారం ——— దేశమంతటా
14 — ఆదివారం —————- దేశమంతటా.
16 — సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం ————- గ్యాంగ్ టక్
20 — నాలుగో శనివారం —– దేశమంతటా సెలవు
21 — ఆదివారం ————— దేశమంతటా సెలవు
22 — మహారాణా ప్రతాప్ —— సిమ్లా
జయంతి
28 — ఆదివారం ————– దేశమంతటా సెలవు
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో వరుసగా మూడు బ్యాంకులు పని చేయవు. ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు పని చేయవు. 20న నాలుగో శనివారం, 21న ఆదివారం, 22న మహారాణా జయంతి సందర్భంగా బ్యాంకులు మూసే ఉంటాయి.