UPI services Close | ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో యూపీఐ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం తదితర యాప్స్ సహాయంతో డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాన్ (NPCI) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకులు డిస్కనెక్ట్ చేసిన.. లేదంటే సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను మార్చి 31 వరకు తొలగించాలని యాప్‌లను ఆదేశించింది.
వాస్తవానికి ఒక మొబైల్ నంబర్‌ను వరుసగా 90 రోజుల పాటు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్.. కనీసం డేటా కోసం ఉపయోగించకపోయినా ఆ నంబర్‌ను మొబైల్ కంపెనీలు డీయాక్టివ్ చేస్తాయి. ఆయా నంబర్లను ఇతరులకు కేటాయిస్తాయి. అలాంటి నంబర్ల వారంతా బ్యాంక్, ఇతర ఆర్థిక లావాదేవీల కోసం లింక్ చేసిన సమయంలో సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో అలాంటి బ్యాంకు ఖాతాలను తొలగించే పని ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతివారం జరుగనున్నది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు డీయాక్టివేట్ అయినా, సరెండర్ చేసిన నంబర్లను ఎప్పటికప్పుడు తొలగిస్తూ.. జాబితాను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాల్సిందేనని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.
గతేడాది జులూ 16న స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలను అనుగుణంగా కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్యాంకులు మొబైల్ నంబర్ల గురించి తెలుసుకునేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మార్చి 31 నాటికి బ్యాంకులతో పాటు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు సైతం మార్గదర్శకాలు పాటించాల్సిందేనని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి వివరణాత్మక నివేదికలు పంచుకోవాల్సిందేనని చెప్పింది.
అలాగే అప్డేట్ చేసిన మొబైల్ నంబర్ స్టిసమ్ని ఉపయోగించి.. నిర్వహించిన లావాదేవీల సంఖ్యను పేర్కొనాలని పేర్కొంది. ఎన్పీసీఐ చర్యతో సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. వాస్తవానికి యూపీఐ కోసం మొబైల్ నంబర్ తప్పనిసరి. గతంలో యూపీఐకి లింక్ చేసిన నంబర్లను ఉపయోగించి ప్రస్తుతం చాలామంది లావాదేవీలు జరుపుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి అలా చేయడం కుదరదు. తప్పనిసరిగా యాక్టివ్‌లో ఉన్న నంబర్ మాత్రమే బ్యాంకులు పరిగణలోకి తీసుకుంటాయి. యాక్టివ్‌లో లేని నంబర్ల యూపీఐలను డీయాక్టివేట్ కానున్నాయి. మీకు తప్పనిసరిగా యూపీఐ సేవలు కావాలంటే ఆయా మొబైల్ నంబర్లను తప్పనిసరిగా రీచార్జ్ చేయాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు.