Bank Holidays | ఏప్రిల్ ఒకటో తేదీ.. నూతన ఆర్థిక సంవత్సరం తొలిరోజు.. బ్యాంకింగ్తోపాటు ఇతర రంగాల ఉద్యోగులపై పనిభారం వల్ల సెలవులు వస్తాయని ఆశిస్తుంటారు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా బ్యాంక్ శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. అయితే, మీరు బ్యాంకుకు వెళ్లాలనుకున్నప్పుడు ఆ రోజు సెలవులేమైనా ఉన్నాయా.. అని ఒక్కసారి క్యాలెండర్ చెక్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఏప్రిల్లో వరుసగా రెండు వారాంతాల్లో సెలవులు వస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా వచ్చే నెలలో బ్యాంకులకు తొమ్మిది రోజులు సెలవులు ఉన్నాయి. వీటితో కలుపుకుని ఈ నెలలో బ్యాంకులు 15 రోజులు మాత్రమే సేవలందిస్తాయి.. అవేంటో ఓ లుక్కేద్దాం..
ఏప్రిల్ ఒకటో తేదీ ఆర్థిక సంవత్సరం తొలి రోజు.. అదే రోజు పాత ఆర్థిక సంవత్సర ఖాతాల ముగింపు కావడంతో బ్యాంకులు పని చేయవు. బెలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్ము, ముంబై, నాగ్పూర్, పనాజీ, శ్రీనగర్ల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. రెండో తేదీ తొలి శనివారం అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంవత్సరాది, మహారాష్ట్రలో గుడి పడ్వా, కర్ణాటకలోనూ ఉగాది పర్వదినం జరుపుకుంటారు కనుక రెండో తేదీన కూడా బ్యాంకులకు సెలవు. మూడో తేదీన ఆదివారం వారాంతపు సెలవు.
ఏప్రిల్ 14, 15 తేదీల్లో బ్యాంకులకు సెలవు. 14న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, తమిళ నూతన సంవత్సరాది, వివిధ ప్రాంతాల్లో చైరావోబా, బిజు ఫెస్టివల్, బొహాగ్ బిహూ ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. 15న గుడ్ ఫ్రైడేతోపాటు బెంగాల్ నూతన సంవత్సరాది, హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 17న ఆదివారం సెలవు. అంతకుముందు తొమ్మిదో తేదీన రెండో శనివారం, 10న ఆదివారం వారాంతపు సెలవుల సందర్భంగా బ్యాంకులు పని చేయవు. 23న నాలుగో శనివారం, 24 ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
వీటిల్లో రెండవ/ నాల్గవ శనివారాలు, ఆదివారాలు మినహా మిగతా సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులు పని చేయవు. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ బ్యాంకులన్నింటికీ ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెలవులు వర్తిస్తాయి. బ్యాంకుల సెలవులను రాష్ట్రాల వారీ పండుగలు, ప్రాంతీయ సెలవులు, జాతీయ పండుగల సంబురాలుగా ఆర్బీఐ వర్గీకరించింది.