Bajaj Chetak 2901 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో (Bajaj Auto)’ తన చేతక్ ఈవీ స్కూటర్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. ‘చేతక్ 2901’ అనే పేరుతో కొత్త ఈవీ స్కూటర్‌ను శుక్రవారం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.95,998 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. న్యూ చేతక్ 2901 స్కూటర్ల ప్రీ బుకింగ్స్ సంస్థ వెబ్సైట్లో ఆన్ లైన్లో ప్రారంభం అయ్యాయి.
కస్టమర్లు తమ సమీప షోరూమ్ కు వెళ్లి చేతక్ స్కూటర్ ఈవీ వివరాలు తెలుసుకుని, టెస్ట్ రైడ్ తర్వాత బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. బజాజ్ చేతక్ 2901 స్కూటర్ ఐదు రంగులు – రెడ్, వైట్, బ్లాక్, లైమ్ ఎల్లో, అజూర్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. ఏఆర్ఏఐతోపాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జింగ్ చేస్తే 123 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
బజాజ్ చేతక్ 2901 స్కూటర్ కలర్డ్ డిజిటల్ కన్సోల్, ట్యూబ్ లెస్ టైర్లతోపాటు అల్లాయ్ వీల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అదనపు ఫీచర్లు జత కలిశాయి. టెక్ పాక్‌తో కస్టమర్లు అప్ డేట్ చేసుకోవచ్చు. టెక్ పాక్‌లో హిల్ హోల్డ్, స్పోర్ట్ అండ్ ఎకానమీ మోడ్స్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, ఫాలోమీ హోం లైట్స్, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 500 డీలర్ షిప్ లు నిర్వహిస్తున్నది. బజాజ్ చేతక్ స్కూటర్ ప్రీమియం, అర్బన్, 2901 మోడ్స్ లో లభిస్తుంది.