Bajaj CNG Bike | బజాజ్ నుంచి సీఎన్జీ బైక్.. జూన్ లో ఆవిష్కరణ
Bajaj CNG Bike | పర్యావరణ పరిరక్షణతోపాటు ఫ్యుయల్ ఎఫిషెన్సీ కోసం సీఎన్జీ ఫ్యూయల్ మోటార్ సైకిల్ తయారు చేస్తున్నట్లు బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ చెప్పారు. జూలైలో మార్కెట్లో ఆవిష్కరిస్తామన్నారు.
Bajaj CNG Bike | దేశంలో పేరొందిన ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) క్లీన్ ఫ్యుయల్ సీఎన్జీ (Clean fuel CNG) మోటార్ సైకిల్ డెవలప్చేస్తున్నది. జూన్‌లో సీఎన్జీ బజాజ్ ఆటో మోటార్ సైకిల్‌ను మార్కెట్లో ఆవిష్కరిస్తామని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ శుక్రవారం తెలిపారు. పర్యావరణ పరిరక్షణతోపాటు ఇంధన పొదుపు పాటించే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని డిఫరెంట్ బ్రాండ్ కింద సీఎన్జీ బైక్ ఆవిష్కరిస్తామని చెప్పారు. కస్టమర్ల సౌకర్యార్థం సీఎన్జీ మోటారు బైక్‌లో పెట్రోల్, సీఎన్జీ ఫ్యుయల్ ఆప్షన్ల కోసం విడిగా ప్రత్యేక ఫ్యుయల్ ట్యాంక్ ేర్పాటు చేస్తారు. తత్ఫలితంగా పెట్రోల్ మోటారు బైక్‌లతో పోలిస్తే `బజాజ్ సీఎన్జీ బైక్` ధర ఎక్కువగా ఉంటుందని రాజీవ్ బజాజ్ చెప్పారు.
20 ఏండ్ల క్రితం మార్కెట్లో విడుదల చేసిన పల్సర్ మోడల్ మోటారు సైకిళ్లకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన, ఆదరణ లభించిందని రాజీవ్ బజాజ్ తెలిపారు. త్వరలో బజాజ్ పల్సర్ విక్రయాలు 20 లక్షల యూనిట్లకు చేరతాయని చెప్పారు. పల్సర్ బజాజ్ మోటారు సైకిలు మాదిరిగానే బజాజ్ సీఎన్జీ బైక్‌ను కూడా కస్టమర్లు ఆదరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
Read More :
Bajaj CNG Bike | జూన్‌లో బజాజ్ కొత్త బైక్.. ఉద్గారాలకు చెక్ ఇలా..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

