రెండింతలైన యాక్సిస్ బ్యాంక్ లాభం

న్యూఢిల్లీ, జూలై 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,160 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,112.17 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మొండి బకాయిలు పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.19,032.15 కోట్ల నుంచి రూ.19,591.63 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏడాది క్రితం 4.72 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికానికి 3.85 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 1.23 శాతం నుంచి 1.20 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ కేటాయింపులు రూ.4,416.42 కోట్ల నుంచి రూ.3,532.01 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Axis Bank
- private bank
- profits
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

