Auto Sales | నాలుగేండ్లలోనే బెస్ట్.. ఫెస్టివ్ సీజన్లో అదరగొట్టిన వెహికల్స్ సేల్స్!
Auto Sales | ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో వెహికల్స్ సేల్స్ అదరగొట్టాయి. నాలుగేండ్లలోనే బెస్ట్ విక్రయాలు నమోదయ్యాయని ఫాడా పేర్కొంది.
Auto Sales | గత నాలుగేండ్లలో ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో బెస్ట్ బిజినెస్ జరిగిందని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (ఫాడా) అంచనా వేసింది. 2021 అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో 48 శాతం సేల్స్ పెరిగాయి. 2021 అక్టోబర్‌లో 14,18,726 వెహికల్స్ రిజిస్ట్రేషన్ నమోదైతే.. గత నెలలో 20,94,378 యూనిట్స్ రిజిస్ట్రేషన్ పెరిగింది. ప్రీ-కొవిడ్ అంటే 2019 అక్టోబర్‌తో పోలిస్తే ఎనిమిది శాతానికి పైగా ఎక్కువ కార్లు, టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. కేవలం కార్లు, టూ వీలర్స్ మాత్రమే కాదు అన్ని క్యాటగిరీల వెహికల్స్ సేల్స్ రికార్డు స్థాయి సేల్స్ నమోదయ్యాయి.
గతేడాది 2,33,822 యూనిట్ల కార్లు అమ్ముడైతే ఈ ఏడాది 41 శాతం పెంచుకుని 3,28,645 యూనిట్లకు పెరిగాయి. టూ వీలర్స్ 10,39,845 యూనిట్ల నుంచి 51 శాతం వృద్ధితో 15,71,165 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల సేల్స్ 25 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబర్‌లో 59,363 కమర్షియల్ వెహికల్స్ సేల్స్ నమోదైతే, ఈ ఏడాది 74,443 యూనిట్స్ అమ్ముడయ్యాయి. త్రీ వీలర్స్ సేల్స్ 66 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 17 శాతం పెరిగాయి.
ప్యాసింజర్ సేల్స్‌లో ఎస్యూవీ మోడల్ కార్లకు ఫుల్ గిరాకీ లభించింది. ప్రీ-కొవిడ్ నాటి పరిస్థితులతో పోలిస్తే టూ వీలర్స్‌లో ఆరు శాతం గ్రోత్ నమోదైంది. నవరాత్రి, దీపావళి పర్వదినాలు ఒకే నెలలో రావడంతో ఆటో డీలర్ షాప్‌లకు వచ్చిన సందర్శకుల సంఖ్య రెట్టింపైందని ఫాడా ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా చెప్పారు. 42 రోజుల పాటు సాగిన ఫెస్టివ్ సేల్స్‌లో 29 శాతం గ్రోత్ రికార్డయింది. 2021లో 22,42, 139 వెహికల్స్ సేల్ అయితే, ఈ ఏడాది ఫెస్టివ్ సేల్స్‌లో 28,88,131 వాహనాలు అమ్ముడయ్యాయి. కార్ల విక్రయాల్లో 34 శాతం, టూ వీలర్స్ సేల్స్ 26 శాతం, త్రీ వీలర్స్ 68, కమర్షియల్ వెహికల్స్ 29, ట్రాక్టర్స్ సేల్స్ 30 శాతం పెరిగాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

