Audi RS 5 Sportback launch |జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా సోమవారం దేశీయ విపణిలోకి అప్డేటెడ్ ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ కారును ఆవిష్కరిస్తోంది. పెర్పార్మెన్స్ ఫోకస్డ్ లగ్జరీ కారు 2019 డిసెంబర్ నుంచే అంతర్జాతీయ విపణిలో అందుబాటులో ఉంది. ఇటీవలే భారత మార్కెట్లోకి అడుగు పెట్టిన ఎస్5 స్పోర్ట్ బ్యాక్ మాదిరిగానే ఆర్ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ వస్తోంది. అయితే ఇంటర్నేషనల్, ఇండియా మోడల్ కార్లలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆ వివరాలేంటో ఓసారి చూద్దామా..!
భారతదేశంలోనే కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ విక్రయించ నున్నారు. హై పెర్పార్మెన్స్ గల ఈ కారు ధర కూడా అత్యధికంగానే ఉంటుంది. దీని ధర రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
ఆర్ఎస్ 7 స్పోర్ట్ బ్యాక్‌తో పోలిస్తే స్పోర్టియర్‌గా, షార్పర్గా ఉంటుంది. మ్యాట్రిక్స్ ఎల్ఈడీ లైటింగ్ టెక్నాలజీతో షార్పర్ రివైజ్డ్ హెడ్ ల్యాంప్స్. రీ డిజైన్డ్ వైడర్ సింగిల్ ఫ్రేమ్ గ్రిల్లె ఫీచర్ తాజా మోడల్‌తో జత కలిసింది.
పాత మోడల్ కారుతో పోలిస్తే ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ కారుకు 40 మీమీ వైడర్ వీల్స్ అనుసంధానిస్తారు. ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌ను రీ డిజైన్ చేశారు. ఆర్ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ కారు 19 అంగుళాల వీల్స్ స్టాండర్డ్‌తో ముందుకు వస్తుందని భావిస్తున్నారు. 20 అంగుళాల వీల్స్ ఆప్షన్ కూడా లభిస్తుందని భావిస్తున్నారు.
న్యూ ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్ బ్యాక్ కారు రివైజ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వినియోగదారుల ముంగిట్లోకి వస్తున్నది. 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తోపాటు ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్ జత చేశారు.
పాత మోడల్ ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ 2.9 లీటర్ల ట్విన్ టర్బో చార్జ్డ్ వీ6 పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. తాజా మోడల్ కారు ఆడి ఫేమస్ క్వాట్ట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తోపాటు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించిన ఇంజిన్‌తో వస్తున్నది. 444 బీహెచ్పీ పవర్ ఔట్పుట్, 600 ఎన్ఎం గరిష్ట టార్చ్ సామర్థ్యం ఈ కారు ఇంజిన్ సొంతం.