Ather Rizta | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ తన ఫ్యామిలీ స్కూటర్ ‘ఎథేర్ రిజ్టా (Ather Rizta)’ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గతంలో ఎథేర్ 450 మోడల్ మాదిరిగా కాకుండా చూడటానికి పలు ఫీచర్లలో మార్పులు చేశారు. లెగ్ స్పేస్, పొడవాటి సీట్లతో ఎథేర్ రిట్జా తీసుకొచ్చారు. రిజ్టా ఎస్, రిజ్టా జడ్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. రిజ్టా ఎస్ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్ షోరూమ్), రిజ్టా జడ్ వేరియంట్ రూ.1.25 లక్షలకు లభిస్తే రిట్జా జడ్ టాప్ వేరియంట్ రూ.1.45 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. రిజ్టా ఎస్, రిజ్టా జడ్ వేరియంట్లు సింగిల్ చార్జింగ్ చేస్తే 123 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. రిజ్టా జడ్ టాప్ వేరియంట్ గరిష్టంగా 160 కిమీ దూరం ప్రయాణించొచ్చు. మూడు వేరియంట్ స్కూటర్లు గరిష్టంగా గంటకు 80 కిమీ దూరం ప్రయాణిస్తాయి.
రిజ్టా ఎస్ మూడు, రిజ్టా జడ్ వేరియంట్ ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్మార్ట్ ఎకో, జిప్ మోడ్ల్లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాఫ్ సిగ్నల్, థెఫ్ట్ డిటెక్ట్, మ్యూజిక్ ట్విస్ట్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ రిజ్టా ఎస్ స్కూటర్లో ఏడంగులాల ఎల్సీడీ డిస్ ప్లే, మిగతా రెండు వేరియంట్లలో ఏడంగుళాల టీఎఫ్టీ డిస్ ప్లే ఉంటది. ఎథేర్ సంస్థ.. ఈ రెండు స్కూటర్లతోపాటు ఎథేర్ హలో, హలో బిట్ అనే పేర్లతో స్మార్ట్ హెల్మెట్లు తెచ్చింది. ఎథేర్ హలో హెల్మెట్ రూ.14,999, హలో బిట్ రూ.4,999 పలుకుతుంది.