హైదరాబాద్, డిసెంబర్ 29: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఏథర్ ఎనర్జీ…తెలంగాణలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. తాజాగా కరీంనగర్లో కొత్తగా రిటైల్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలో సంస్థకు ఇది మూడో అవుట్లెట్ కాగా, దేశవ్యాప్తంగా సంస్థ కు ఇది 77 కావడం విశేషం.
ఏథర్ 450 ఎక్స్, 450 ప్లస్ మోడళ్లను టెస్ట్ రైడ్‌తోపాటు కొనుగోలు చేయవచ్చునని కంపెనీ చీఫ్ బిజినెస్ అధికారి రవ్నీత్ సింగ్ తెలిపారు. గడిచిన ఏడాదికాలంలో రాష్ట్రంలో ఈవీలకు డిమాండ్ నెలకొన్నదని, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.