హైదరాబాద్, నవంబర్ 22: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అశోక్ చంద్ర నియమితులయ్యారు.1991లో ప్రొబేషనరీ అధికారిగా తన కెరియర్ను ప్రారంభించిన అశోక్.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈడీగా పదోన్నతి పొందారు. ఈ నెల 21నే ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.