Chanda-Deepak Kochhar | కొచ్చర్ దంపతుల అరెస్ట్ చట్ట విరుద్ధం.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Chanda-Deepak Kochhar | లోన్ ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ కం సీఈఓ చందా కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Chanda-Deepak Kochhar | ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ మాజీ ఎండీ కం సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు బాంబే హైకోర్టు రిలీఫ్ కల్పించింది. లోన్ ఫ్రాడ్ కేసులో కొచ్చర్ దంపతులను సీబీఐ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్లను అరెస్ట్ చేసే విషయంలో చట్టం పట్ల సీబీఐ అధికారులకు గౌరవం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది అధికార దుర్వినియోగమేనని కొచ్చర్ దంపతుల అరెస్ట్ చట్ట విరుద్ధం అని జస్టిస్‌లు అనుజా ప్రభుదేశాయ్, ఎఆర్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. గతేడాది జనవరిలో మరో బెంచ్ దీపక్ కొచ్చర్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. విచారణకు సహకరించడం లేదన్న సీబీఐ వాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిందితులకు మౌనంగా ఉండే హక్కు ఉంటుందని తెలిపింది.
వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసులో 2022 డిసెంబర్ 23న చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ లను సీబీఐ అరెస్ట్ చేసింది. తనను అరెస్ట్ చేయడానికి వ్యతిరేకంగా దీపక్ కొచ్చర్ హైకోర్టును ఆశ్రయించారు. 2023 జనవరి 9న న్యాయస్థానం కొచ్చర్‌కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. సాధారణ అరెస్ట్‌లను నివారించడానికే సీఆర్పీసీలో కొత్తగా 41ఏ సెక్షన్ జత చేశారని దేశ సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది.ఈ నెల ఆరో తేదీన సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

