హైదరాబాద్, మార్చి 11: ప్రపంచంలో అతిపెద్ద బొమ్మల విక్రయ సంస్థ ‘టాయ్స్ ఆర్ యూఎస్’..భారత్‌లో తన తొలి రిటైల్ అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వద్ద ఉన్న శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌లో కంపెనీకి సంబంధించిన అన్ని రకాల బ్రాండెడ్ బొమ్మలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో నితిన్ ఛబ్రా మాట్లాడుతూ..హైదరాబాద్‌లో మా మొదటి స్టోర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది, పిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టాయ్స్‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.