రేపటినుంచి అమూల్ పాల ధరలకు రెక్కలు

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలు లీటర్‌కు రెండు రూపాయలు పెరిగాయి. జులై 1 నుంచి అన్ని బ్రాండ్లపై లీటర్‌కు రూ 2 చొప్పున పెరిగిన పాల ధరలు వర్తిస్తాయని గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్. సోధి వెల్లడించారు. ఆవు, బర్రె పాలతో పాటు గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటి ధరలు పెరగనున్నాయని చెప్పారు.
ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు ప్యాకేజింగ్ ఖర్చు 30 నుంచి 40 శాతం వరకూ భారమవడంతో పాల ధరల పెంపు అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు రవాణా వ్యయం 30 శాతం ఎగబాకిందని అన్నారు. అమూల్ బ్రాండ్‌పై జీసీఎంఎంఎఫ్ వెన్న, మీగడ, ఐస్‌క్రీం వంటి ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- amul
- Gujarat
- milk
- Prices Hike
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

