హైదరాబాద్, ఆగస్టు 25: ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న గిగావాట్ కంప్యూట్ సామర్థ్యంలో భాగంగా హైదరాబాద్లోని తన తొలి ఏఐ ఫ్యాక్టరీలో వెరా రూబిన్ ఎన్వీఎల్ 72 ర్యాక్ స్కేల్ సిస్టమ్స్గా సుమారు 9,000 ఎన్విడియో రూబిన్ జీపీయూలను ఏర్పాటు చేసేందుకు ఏఎంఐ ముందుకొచ్చింది. గ్రీన్కో ప్రమోటర్లు ఏర్పాటు చేసిన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ఏఎం ఇంటెలిజెన్స్ ఎనర్జీ, కంప్యూట్, ఇన్నోవేషన్ సమ్మిళితంతో ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ప్రపంచంలోనే అగ్రగామి ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థగా ఎదిగేందుకు క్రమంగా అడుగులు వేస్తున్నది.
ఈ లక్ష్యం దిశగా తొలి అడుగు వేస్తూ హైదరాబాద్లోని తన తొలి ఏఐ ఫ్యాక్టరీ కోసం 2027 తొలి త్రైమాసికంలో డెలివరీ అయ్యేలా వెరా రూబిన్ కొనుగోలుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. 30 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ వెరా రూబిన్ ఎన్వీఎల్ 72 ర్యాక్ స్కేల్ సిస్టమ్స్గా ఏర్పాటు చేయనున్న 9000 ఎన్విడియో రూబిన్ జీపీయూలు ఈ ఆర్డర్లో ఉందని కంపెనీ చైర్మన్ అనిల్ చలమశెట్టి తెలిపారు.