న్యూఢిల్లీ, అక్టోబర్ 8 : అదానీ గ్రూప్ సంస్థ నుంచి రూ. 20,000 కోట్ల నిధుల్ని తీసుకునేందుకు అంబూజా సిమెంట్స్ షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారు. శనివారం జరిగిన కంపెనీ షేర్హోల్డర్ల అత్యవసర సర్వసభ్య సమావేశం అదానీ గ్రూప్ నుంచి నిధుల సమీకరణ, గౌతమ్ అదానీని డైరెక్టర్ల బోర్డులో నియామకానికి అంగీకారం తెలిపినట్లు అంబూజా సిమెంట్స్ ప్రకటించింది. సిట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ నుంచి అంబూజా సిమెంట్స్, ఏసీసీలను ఇటీవల గౌతమ్ అదానీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.