దూసుకొస్తున్న ఏఐ చాట్‌బాట్స్ : స్మార్ట్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తున్న టెక్ దిగ్గజాలు
ఇక ఏఐ ఇప్పుడు పని ప్రదేశాలకూ రానుంది. వ్యాపారాల కోసం, నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాయం చేసేందుకు టెక్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ క్యూ(Amazon Q)ను లాంఛ్ చేసింది.
న్యూఢిల్లీ : ఈ ఏడాది అంతా కృత్రిమ మేథపైనే వాడివేడి చర్చ సాగింది. చాట్‌జీపీటీ, బార్డ్, బింగ్ వంటి చాట్‌బాట్స్ ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. కంటెంట్ రాయడం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడం నుంచి సంక్లిష్ట పనులను చక్కబెట్టడం వరకూ చిటికెలో ఏఐ టూల్స్ యూజర్లు నిర్ధేశించిన పనులను క్షణాల్లో చేసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలూ ఏఐ చాట్‌బాట్స్ క్రియేట్ చేయగా ఎలన్ మస్క్ సారధ్యంలోని ట్విట్టర్ సైతం గ్రోక్ ఏఐ పేరుతో ఏఐ టూల్‌ను తీసుకువచ్చింది. ఇదే రేసులో ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
ఇక ఏఐ ఇప్పుడు పని ప్రదేశాలకూ రానుంది. వ్యాపారాల కోసం, నిర్ణయాలు తీసుకునే క్రమంలో సాయం చేసేందుకు టెక్ దిగ్గజం అమెజాన్ ఇటీవల అమెజాన్ క్యూ(Amazon Q)ను లాంఛ్ చేసింది. ఈ చాట్‌బాట్ అందరికీ అందుబాటులో ఉండదు. కంపెనీల్లో పనిచేస్తూ ఏఐ ఆధారిత అసిస్టెంట్ సేవలు కోరుకునే ఉద్యోగులకు మాత్రమే అమెజాన్ క్యూ అందుబాటులో ఉంటుంది.
అమెజాన్ క్యూ యూజర్లకు సూపర్ స్మార్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తుందని, కంటెంట్ క్రియేట్ చేయడం, సమస్యలను పరిష్కరించడం, యూజర్లు కోరిన సమాచారం అందించడం, కంపెనీ డేటాను యాక్సెస్ చేసి తక్షణ సలహాలు అందించడం వంటి సేవలు ఆఫర్ చేస్తుందని కంపెనీ తన వెబ్సైట్లో రాసుకొచ్చింది. తమ న్యూ ఏఐ చాట్‌బాట్ టాస్క్‌లను క్రమబద్ధీకరించడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, పనిలో సృజనాత్మకత, వినూత్న ఆవిష్కరణలకు సాయపడుతుందని అమెజాన్ పేర్కొంది.
Read More :
Layoffs | వీడియో గేమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువుల కోత : 256 మంది ఉద్యోగులపై యూనిటీ వేటు
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- AI
- Amazon Q
- Business news
- chatbot
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

