Amazon | గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్
పండగ సీజన్లో అమ్మకాలు పెంచుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఫెస్టివ్ సేల్స్‌తో కస్టమర్ల ముందుకొస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అధికారికంగా ప్రకటించింది.
న్యూఢిల్లీ : పండగ సీజన్లో అమ్మకాలు పెంచుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఫెస్టివ్ సేల్స్‌తో కస్టమర్ల ముందుకొస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అధికారికంగా ప్రకటించింది. సేల్ డేట్స్‌ను వెల్లడించకున్నా నెలాఖరులో పండగ సీజన్ సందర్భంగా సేల్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టింది. ప్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను చేపట్టిన సందర్భంలోనే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అమెజాన్ ముందుకు తెస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు సేల్స్ నెలాఖరులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సేల్‌లో ముఖ్యంగా ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లను ఈకామర్స్ దిగ్గజాలు ఆఫర్ చేయనున్నాయి.
అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ సైతం ఐఫోన్ 13, ఇతర మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. బ్రాండ్ న్యూ ఐఫోన్‌ను సొంతం చేసుకునేందుకు పండగ సీజన్ మంచి అవకాశంగా ముందుకొస్తోంది. ఇక ఐఫోన్లతో పాటు ఐక్యూఒఒ 9టీ, వన్‌ప్లస్ 10టీ సహా శాంసంగ్, రియల్‌మి, రెడ్మి, ఒప్పో, వివో, లావా, నోకియా ఫోన్లపై ఊరించే డిస్కౌంట్లు లభిస్తాయని అమెజాన్ టీజర్ వెల్లడించింది. టీవీలు, హోం అప్లయన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాలపై అమెజాన్ సేల్‌లో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం అమెజాన్ ఎస్బీఐతో చేతులు కలిపింది.
ఎస్బీఐ భాగస్వామ్యంతో ఆయా ప్రోడక్ట్‌లపై పది శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. ఇక ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ప్రకటించింది. డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల నుంచి కస్టమర్లకు పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్ 13ను కొనుగోలు చేయాలనుకునే వారు కూడా ఐఫోన్ 14 లాంఛ్ అనంతరం ఐఫోన్ 13, ఐఫోన్ 12 ధరలు తగ్గే అవకాశం ఉండటంతో అప్పటివరకూ వేచిఉండటం మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

