Wikipedia Blames Adani Group | షేర్లే కాదు.. వికీపీడియాలోనూ ‘అదానీ’ స్టైల్ మాయ..! ఏం జరిగిందంటే?!
Wikipedia Blames Adani Group | షేర్లలోనే కాదు.. అందరికీ డేటా అందించే వికీపీడియా కూడా తమను అదానీ గ్రూప్ ఏమార్చిందని ఆరోపణలు చేసింది. సాక్ పప్పెట్ ఎడిటర్లతో అదానీ కంపెనీల డేటాలో పొగడ్తలతో కూడిన డేటా జోడించారని వికీపీడియా పేర్కొంది.
Wikipedia Blames Adani Group | అమెరికా షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ కంపెనీలు కుదేలయ్యాయి. అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటికి 134 బిలియన్ డాలర్ల మేరకు ఆవిరై పోయింది. ఒకవైపు హిండెన్ బర్గ్ నివేదిక నీలి నీడలు వెంటాడుతుండగానే మరో వివాదంలో చిక్కుకున్నది అదానీ గ్రూప్.
వికీపీడియాలోని సమాచారం అదానీ గ్రూప్ సంస్థలు తారుమారు చేశారని వికీపీడియా అనుబంధ న్యూస్ పేపర్ ది సైన్ పోస్ట్ (The Signpost) ఓ వార్తాకథనం ప్రచురించింది. గౌతం అదానీ, ఆయన కుటుంబ సభ్యులు గ్రూపు కంపెనీల సమాచారంలో పక్షపాత పూరిత కంటెంట్ జత చేశారని, వికీపీడియాలో ఉన్న వార్నింగ్లనూ తొలగించారని ఆ సంస్థ ఆరోపణ. అదానీ గ్రూప్ సంస్థల పట్ల పక్షపాత పూరిత కంటెంట్ జత చేయడానికి, వికీ వార్నింగ్‌లు తొలగించడానికి సాక్ పప్పెట్ ఖాతాలు, పెయిడ్ ఎడిటర్లను వాడుకున్నారని వికీపీడియా వ్యాఖ్యానించింది. అలా కంటెంట్ మార్చిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీల ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.
అదానీ ఐపీ అడ్రస్‌ల నుంచే ఆర్టికల్స్ ఎడిటింగ్
అదానీ కుటుంబం, అదానీ వ్యాపారాల సమాచారం తారుమారు చేశారని, పక్షపాత పూరితంగా అంటే పొగుడుతూ సమాచారం జోడించారని వికీపీడియా ఆరోపణ. 2007లోనే అదానీ గురించి వచ్చే ఆర్టికల్స్ ముక్కుసూటిగా ఉండేవని తెలిపింది. 2012లో ముగ్గురు ఎడిటర్లు.. అదానీ గ్రూప్ కంటెంట్‌లో మార్పులు చేర్పులు చేశారని, వార్నింగ్ టెక్ట్స్ కూడా తొలగించారని పేర్కొన్నది. ఇలా తొమ్మిది ఆర్టికల్స్ రూపొందించిన లేదా సవరించిన 40 మంది పెయిడ్ ఎడిటర్లు, సాక్ పప్పెట్లను బ్లాక్ చేశామని వివరించింది. ఇలా ఎడిట్ చేసిన వాటిలో అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్‌లు కూడా గుర్తించామని తెలిపింది.
అదానీ కంపెనీ ఆర్టికల్ పూర్తిగా తారుమారు ఇలా
‘అదానీ గ్రూప్‌నకు చెందిన ఒక పెయిడ్ ఎడిటర్.. ఆ కంపెనీ ఆర్టికల్ పూర్తిగా మార్చేశారు. ఈ పనంతా అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్ నుంచే జరిగింది. విరుద్ధ ప్రయోజనాల వార్నింగ్‌లూ తొలగించారు. మా వికీ పీడియా క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థలకు చిక్కకుండా కొన్ని ఆర్టికల్స్ తయారు చేశారు’ అని వికీపీడియా తెలిపింది. ఈ ఆర్టికల్స్ సమీక్షకుడు హాచెన్ తన స్థానాన్ని దుర్వినియోగం చేయడంతో ఆయనపై బ్యాన్ విధించామన్నది. కాగా, వికీ పీడియాలో వచ్చిన కథనాన్ని హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ నాథన్ ఆండర్సన్ ట్వీట్ చేశారు. వికీపీడియాను కూడా అదానీ గ్రూప్ ఏమార్చిందని ఆరోపించారు. వికీ పీడియా ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇంకా రియాక్ట్ కాలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

