Adani | గౌతమ్ అదానీకి యూఎస్ సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ కమిషన్ సమన్లు..
Adani | అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) సమన్లు జారీ చేసింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,200 కోట్లు) లంచం ఇచ్చారన్న ఆరోపణలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కమిషన్ కోరింది.
Adani | అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) సమన్లు జారీ చేసింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,200 కోట్లు) లంచం ఇచ్చారన్న ఆరోపణలపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కమిషన్ కోరింది. అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ నివాసానికి, అలాగే మేనల్లుడు సాగర్ బోడక్‌దేవ్ నివాసానికి సమన్లు పంపింది. ఈ నెల 21న న్యూయార్క్ ఈస్ట్రన్ కోర్టు నుంచి నోటీసులు పంపింది. సమన్లు అందుకున్న 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పింది. అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారని, ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినట్లు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ఆరోపించిన విషయం తెలిసిందే.
సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టులు పొందేందుకు భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అమెరికాలో క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. గౌతమ్ అదానీపై విదేశీ లంచం, సెక్యూరిటీల మోసం, వైర్‌ఫ్రాడ్ కుట్ర, సంబంధిత అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల్లో రెండు బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అదానీ 250 మిలియన్ డాలర్లకుపైగా లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అయితే, అదానీ గ్రూప్ ఆరోపణలను ఖండించింది. కంపెనీ కార్యకలాపాలు అన్నిరంగాల్లో పారదర్శకత, నిబద్ధతను ప్రదర్శిస్తామని పేర్కొంది. వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులకు పూర్తిగా కట్టుబడి ఉండే చట్టాలను గౌరవించే సంస్థ అని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
Murthy | టాలీవుడ్ జర్నలిస్ట్‌పై TFJA సంచలన నిర్ణయం.. ఇకపై ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్లకు నో పర్మీషన్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డికి మద్దతుగా కోదాడలో ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

