Aadhar Update | జూన్ 14 తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. తేల్చి చెప్పిన ఉడాయ్..!
Aadhar Update | జూన్ 14 తర్వాత ఆధార్ అప్ డేట్ చేయరని వస్తున్న వార్తలన్నీ వదంతులేనని, వాటిని నమ్మొద్దని భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ ‘ఉడాయ్’ తేల్చి చెప్పింది.
Aadhar Update | జూన్ 14 లోపు వ్యక్తిగత డిటైల్స్ అప్ డేట్ చేయకుంటే ఆధార్ కార్డు పని చేయదంటూ చక్కర్లు కొడుతున్న వదంతులను భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) తోసిపుచ్చింది. కేవలం ఉచితంగా ఆధార్ వివరాలు అప్ డేట్ చేయడానికి మాత్రమే వచ్చే నెల 14 తుది గడువని ఉడాయ్ తేల్చి చెప్పింది. జూన్ 14 తర్వాత కూడ ఆధార్ వివరాల సవరణకు అవకాశం ఉంటుందని, ఆధార్ నమోదు కేంద్రాలకెళ్లి నిర్దేశిత ఫీజు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఇంతకుముందు గతేడాది (2023) డిసెంబర్ 14 వరకూ ఉచితంగా ఆధార్ వివరాల అప్ డేట్ కోసం ఉడాయ్ గడువు విధించింది. తర్వాత రెండు సార్లు వచ్చే నెల 14 వరకూ పొడిగించింది. ఆ లోపు ఆన్ లైన్ లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా ఆధార్ డిటైల్స్ అప్ డేట్ చేసుకోవచ్చు.
ఆధార్ లో పేరు నమోదు చేసుకున్న పదేండ్లకోసారి తమ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని గతంలోనే పౌరులకు ఉడాయ్ సూచించింది. ఇందుకు గుర్తింపు కార్డు, చిరునామా ధృవీకరణ పత్రాలు సమర్పించి, సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (సీఐడీఆర్)లో వివరాలు అప్ డేట్ చేసకోవాలని ఉడాయ్ తెలిపింది. దీనివల్ల పౌరుల సమాచారం ఎప్పటికప్పుడు సీఐడీఆర్లో అప్ డేట్ కావడంతో ఖచ్చితమైన సమాచారం నిక్షిప్తం అయ్యేందుకు దోహద పడుతుందని వివరించింది.
పౌరులు ఉడాయ్ వెబ్ సైట్ లోకి లాగ్ఇన్ అయి తాజా గుర్తింపు కార్డు, చిరునామా వివరాలు సబ్మిట్ చేయాలి. గుర్తింపు కార్డు, చిరునామాకు రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్ బుక్, పాస్ పోర్ట్ వంటివి వాడొచ్చు. టీసీ, మార్కుల జాబితా, పాన్/ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు ధృవీకరణ పత్రంగా, మూడు నెలలు మించని విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను చిరునామా ధృవీకరణ పత్రంగా వాడొచ్చునని ఉడాయ్ వెల్లడించింది. ధృవీకరణ పత్రాలను స్కాన్ చేసి ‘మై ఆధార్’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

