చాలామంది మదుపరులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్‌ను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడికి ప్రభావవంతమైన దారిగా భావిస్తారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ వద్ద నిర్ణీత మొత్తం పెట్టుబడి ద్వారా దీర్ఘకాలిక వ్యవధిలో ఈక్విటీ ఫండ్స్‌లో సంపద సృష్టికి సిప్‌లు మదుపరులకు దోహదపడుతాయి. అందుకే నెలనెలా కొత్త సిప్ రిజిస్ట్రేషన్లు, కంట్రిబ్యూషన్లు క్రమేణా పెరుగుతూపోతున్నాయి.
ఇందుకు తగ్గట్టే గడిచిన ఐదేండ్లలో 13 ఈక్విటీ స్కీములు 25 శాతానికిపైగా సిప్ రిటర్న్స్‌ను అందించాయి. వాటిలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గరిష్ఠంగా 36.86 శాతంతో ముందున్నది. 30.19 శాతంతో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ తర్వాతి స్థానంలో ఉన్నది. మెజారిటీ మార్కెట్ నిపుణులు సైతం సిప్ల ద్వారా ఈక్విటీ స్కీముల్లోకి ప్రవేశం తెలివైన పనేనని చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం అవకాశం ఉంటే ట్రై చేసేయండి.