మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ లేదా సిప్) అనేది ఓ పెట్టుబడి సాధనం. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడికి ఒకేసారి పెద్దమొత్తంలోనైనా లేదా సిప్ మార్గాన్నైనా ఎంచుకోవాల్సి ఉంటుంది. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపరులు దఫదఫాలుగా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆకర్షణీయమైన లాభాలను అందుకోవడానికి సిప్, దీర్ఘకాల పెట్టుబడి విధానం ఉత్తమం.
సిప్‌లు మదుపరులకు ఓ క్రమశిక్షణ మార్గంలో పెట్టుబడి పెట్టడానికి దోహదం చేస్తాయి. సిప్ల ద్వారా నెలనెలా లేదా మూడు నెలలకోసారి (త్రైమాసికం) పెట్టుబడి పెట్టవచ్చు. మన ఆదాయ పరిస్థితులనుబట్టి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవచ్చు. సిప్‌లో పెట్టుబడులతో మదుపరులు దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ లాభాలనే పొందగలరు. అయితే ఎటువంటి సిప్ మనకు లాభమో తెలుసుకుని ముందుకెళ్లాలి. దీనికి సంబంధించి అనుభవజ్ఞులు లేదా మార్కెట్ నిపుణులను అడిగితే తెలివైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇక మార్కెట్లో రకరకాల సిప్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశీయంగా ఉన్న 7 రకాల సిప్ పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తే అవి..