Realme GT Neo 3T | చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ.. దేశీయ మార్కెట్లోకి `రియల్ మీ జీటీ నియో3టీ` తీసుకొచ్చింది. శుక్రవారం ఆవిష్కరించిన `జీటీ నియో3టీ` మోడల్ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షాడో బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.ఫుల్ చార్జింగ్ తర్వాత 88 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆఫర్ చేస్తున్నది. 80 వాట్ల సూపర్‌డార్ట్ చార్జర్‌తో కేవలం 12 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్ అవుతుంది. 5000 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో 88 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం, 29 గంటల కాలింగ్, 26 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం ఆఫర్ చేస్తున్నది రియల్ మీ జీటీ నియో 3.
ఈ నెల 23 నుంచి మూడు వేరియంట్ల `జీటీ నియో3టీ` ఫోన్లు.. ఆఫ్లైన్లోనూ, ఆన్లైన్లో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. 6జీబీ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ రూ.29,999లకు లభిస్తుంది. 8జీబీ రామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కేపాసిటీ గల వేరియంట్ ఫోన్ రూ.31,999లకు కొనుగోలు చేయొచ్చు. ఇక 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.33,999 పలుకుతుంది.
జీటీ నియో 3టీ ఫోన్లో 64 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 మెగా పిక్సెల్ మాక్రో ట్రిపుల్ రేర్ కెమెరా, 6.62 అంగుళాల ఫుల్ హెచ్డీ ఫ్లస్ అమోల్డ్ డిస్ప్లే, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా తదితర ఫీచర్లు వస్తాయి. ఈ కెమెరాలు స్మార్ట్ ఏఐ బ్యూటిఫై మోడ్‌లో ఉంటాయి.
డైనమిక్ రామ్ ఎక్స్పాన్షన్ టెక్నాలజీతో రియల్మీ జీటీ నియో 3టీ ఫోన్లో అదనంగా 5జీబీ రామ్ పెంచుకోవచ్చు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ఫ్రింట్ స్కానర్, రియల్ మీ యూఐ 3.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 12 టెక్నాలజీతో ఇది పని చేస్తుంది.